నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకుడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈసినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో పాల్గొన్న చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శోభిత గురించి మాట్లాడారు.మన పుష్పకా బాప్ అల్లు అరవింద్‌గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే.ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్ తర్వాత అయినా వైజాగ్ టాక్ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే… వైజాగ్‌లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు… నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. ‘తండేల్’ సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా… గుర్తెట్టుకో… ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే’’ అని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు