ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కలిశారు. ఈ విషయాన్ని మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సీఎంతో కలిసి ఉన్న ఫొటోలను ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈరోజు ఉదయం గుజరాత్ లో ఆయన సీఎంను కలిశారు. మంచు విష్ణు, శరత్ కుమార్, ముఖేశ్ రిషి, వినయ్ మహేశ్వరితో పాటు గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఆయనను కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా విష్ణు ఆయనకి ప్రఖ్యాత తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. గుజరాత్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తున్న డైనమిక్ నాయకుడిగా ఆయన ఈ విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ మోహన్ బాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు