విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైలా’.ఈ చిత్రానికి దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.సాహు గార్లపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నారు.ఇటీవల చిత్రం నుండి టీజర్‌తో పాటు రెండు పాటలను విడుదల చేయగా..ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
తాజాగా ఈ చిత్రం నుండి “ఓహో రత్తమ్మా” అనే థర్డ్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది.ఈ పాటలో రీసెంట్‌గా వైరల్ అయిన కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అనే లిరిక్స్ వాడారు.ఇందులో బార్బర్ సోను, లైలా అనే రెండు పాత్రల్లో విశ్వక్ ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తుంది. విశ్వక్ సేన్ జోడిగా ఇందులో ఆకాంక్ష శర్మ నటిస్తుంది.ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.