అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం “తండేల్”.ఈ చిత్రంలో నాగచైతన్య కు జోడిగా సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది.చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మేరకు చిత్రబృందం వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించబోతుంది.ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది.ఈ సందర్భంగా చిత్రబృందం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాకతో అభిమానులకు అనుమతి లేదని తెలిపింది.సినిమా బృందం తప్ప బయటి వారు ఎవరు ఈ సినిమా వేడకకు రాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు సమాచారం.పుష్ప-2 విడుదల సమయంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.