తమిళ అగ్ర నటుడు అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘విడాముయార్చి’.ఈ చిత్రాన్ని తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల చేయనున్నారు.ఈ చిత్రానికి మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.కాగా ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ మేరకు నిన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్ లభించింది.
ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ ‘అద్భుతమైన కథ, కథనాలతో పాటు అత్యున్నత సాంకేతిక విలువలతో ఈచిత్రం తెరకెక్కించమని చెప్పారు.అజిత్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకునే సినిమా ఇది అని అన్నారు.తెలంగాణ, ఏపీలో ఏషియన్ సురేష్ ఎంటైర్టెన్మెంట్స్, సీడెడ్లో శ్రీలక్ష్మీ మూవీస్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇందులో త్రిష, రెజీనా కసండ్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.