ప్రముఖ ఓటీటీ వేదిక నెటిక్స్ తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ ను ప్రకటించింది.ఈ మేరకు బాలీవుడ్ లో బాంబే బేగమ్స్, ఢిల్లీ క్రైమ్,సాక్రేడ్ గేమ్స్, రానా నాయుడు,కాలాపానీ, హిరామండీ, లాంటి వెబ్ సిరీస్లను రూపొందించింది.అయితే ఇప్పుడు తెలుగులో కూడా కామెడీ వెబ్ సిరీస్ ను తెరకెక్కించేందుకు సిద్ధమైంది నెట్ ఫ్లిక్స్.సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో ” సూపర్ సుబ్బు ” అనే వెబ్ సిరీస్ రూపొందించింది.ఇందులో సందీప్ కిషన్ పాటుగా బ్రహ్మనందం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.ఈ ఇందులో సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు.ఈ వెబ్ సిరీస్ లో బర్నింగ్ స్టార్ సంపుర్ణేష్ బాబు, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అయితే నరుడా డోనరుడా, టిల్లు స్క్వేర్ చిత్రాల దర్శకుడు మల్లిక్ రామ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.