స్టార్ హీరోయిన్ సాయిపల్లవి తాజాగా చేస్తున్న చిత్రం ‘తండేల్’.అయితే ఈ మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది.ఆమె ఇప్పటికే హిందీలో రామాయణ పార్ట్-1, ఏక్న్ చిత్రాలు చేస్తుంది.కాగా సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే సాయిపల్లవి తెలుగు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఫిల్మ్ సర్కిల్ వైరల్ అవుతున్న న్యూస్ మేరకు సాయి పల్లవి ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించనుందని సమాచారం.ఈ చిత్రం స్వాతంత్రోద్యమ కాలంలో ఓ సైనికుడి ప్రేమకథగా ‘ఫౌజీ’ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ ఇందులో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది.అయితే కథానుగుణంగా ఈ చిత్రానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందని…ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ కీలక పాత్ర కోసం సాయిపల్లవిని దర్శకుడు సంప్రదించినట్లు తెలుస్తుంది.అయితే ఈ అంశంపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Previous Articleటీటీడీ కీలక నిర్ణయం: అన్యమత ఉద్యోగుల బదిలీ
Next Article వైసీపీ సీనియర్ నాయకులతో అధినేత జగన్ భేటీ