ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చైర్మన్ బీఆర్ నాయుడు కీలక చర్యలు చేపట్టారు. టీటీడీ సంస్థలలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. టీటీడీ మహిళ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు మొత్తం 18 మందిని బదిలీ చేశారు. ఇటీవల తిరుమలలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో టీటీడీలో ఉన్నత స్థాయిలో అన్యమతాలకు చెందిన వారు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. టీటీడీలో సంస్కరణలు మొదలు పెట్టింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను టీటీడీ రూపొందించింది. వీరిలో టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా వున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుర్తించారు. దీంతో ఉద్యోగులను బదిలీ చేయాలని ఈమేరకు నిర్ణయించారు.
Previous Article“తండెల్” టికెట్స్ పెంపుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం…!
Next Article ప్రభాస్ ‘ఫౌజీ’ సాయి పల్లవి ?