న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా , దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్-3 అనే చిత్రం తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని నాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు.ఇందులో శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.పవర్ఫుల్ యాక్షన్ తో బ్రూటల్ థ్రిల్లర్ గా దర్శకుడు రూపొందిస్తున్నాడు.ఇప్పటికే హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది.హిట్-3 నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లకు కూడా మంచి ఆదరణ లభించింది.ఇందులో అర్జున్ సర్కార్ గా నాని చాలా బలమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.ఇందులో నానితో పాటూ మరో ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారని సమాచారం.వారు ఇద్దరు ఎవరంటే ఇప్పటికే హిట్ సిరీస్ లో నటించిన అడివి శేష్ ఒకరు కాగా, మరొకరు విశ్వక్ సేన్.ఈ ఇద్దరు యంగ్ హీరోలు హిట్3లో అతిధి పాత్రల్లో కనిపించనున్నారు అని తెలుస్తుంది.కాగా ఈ సినిమా మే 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.