వైసిపి నేత ,మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్ ) టీడీపీలో చేరారు.ఈ మేరకు అయన టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.అయితే గత ఏడాది వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.అనంతరం ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేయగా.. తాజాగా టీడీపీ అధిష్టానం నుండి లైన్ క్లియర్ కావడంతో ఆళ్ల నాని తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.


