తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు స్ట్రెయిట్ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు చెప్పినట్లు సమాచారం.తాజాగా లక్కీ భాస్కర్ విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా దాదాపు ఖరారైందని తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.అయితే ఈ చిత్రాన్నసితార ఎంటర్‌టైనమెంట్స్ నిర్మించబోతున్నట్లు చెబుతున్నారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించనున్నాడు.అలానే సూర్య దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే సూర్యకి తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని కోరిక ఉంది…ఎప్పటి నుండో మంచి కథ దొరికితే చేస్తానని చాలా సినిమా ఈవెంట్‌లలో సూర్య చెప్పారు.
Previous Articleజీబీఎస్ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు
Next Article చిరు ‘విశ్వంభర’లో మెగా డాటర్ ..?