టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల ‘లైలా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.ఈ సినిమా కలెక్షన్స్ అయితే విశ్వక్ సేన్ గత సినిమాలకంటే దారుణంగా వచ్చాయి.కాగా ఈ చిత్రంపై విశ్వక్ ఎంతగానో ఆశలు పెట్టుకున్నాడు.ఈ సినిమా ఫలితం దారుణంగా రావడంతో విశ్వక్ సేన్ తాజాగా దీనిపై స్పందించాడు.ఈ మేరకు విశ్వక్ తన అభిమానులను ఉద్దేశించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాడు.ఇప్పటివరకు చేసే సినిమాలపై నమ్మకంతో ఇంతకాలం తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.గత కొంతకాలంగా తన నుండి మంచి చిత్రాలు రావడం లేదని అభిమానులు అంటున్నారని..వారి మాటలను తాను గౌరవిస్తున్నానని..ఇకపై తాను చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటానని.. ఎలాంటి వల్గారిటీ లేని కామెడీ చేస్తానని విశ్వక్ సేన్ నోట్ లో పేర్కొన్నాడు.
🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il
— VishwakSen (@VishwakSenActor) February 20, 2025