సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “కూలీ.మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా చిత్రీకరణ కూడ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం.అయితే ఈ చిత్రంపై తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ ఓ క్రేజీ సీక్వెన్స్ ని డిజైన్ చేశాడని తెలుస్తోంది.ఈ చిత్రానికి తన గత సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన సినిమాలకు ఎలాంటి సంబంధం లేని అప్పటికి, వాటిలో ఉన్నలాంటి కొన్ని సీన్స్ ని ఫున్ టైప్ లో చూపించి ఎంటర్టైన్ చేయనున్నాడు చెబుతున్నారు.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
Previous Articleకాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ, బీఆర్ఎస్ నేతల జేబులు మాత్రం నిండాయి:- టిజి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Next Article వారి మాటలను తాను గౌరవిస్తున్నాను:-విశ్వక్ సేన్