పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “హరిహర వీరమల్లు”.ఈ చిత్రాన్ని పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని దర్శకులు రూపొందిస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కొంత భాగానికి దర్శకత్వం వహించగా , అనివార్య కారణాల వలన అయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.ప్రస్తుతం మిగిలిన భాగానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ విడుదల కానుంది.ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది.తాజాగా సెకండ్ సింగిల్ ను విడుదల చేసింది.
తాజాగా “కొల్లగొట్టినాదిరో” అనే రెండో సింగిల్ ను చిత్రబృందం విడుదల చేసింది.ఇందులో నిధి ఆగర్వాల్‌తో పాటు అనసుయ కూడా కనిపించింది.ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్నారు’.ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.