ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. నేటి గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదు. దిశా-నిర్దేశం అంతకన్నా లేదు. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు. సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదనీ పేర్కొన్నారు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదని ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదు. సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పైనా షర్మిల విమర్శలు గుప్పించారు. జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ గారి తీరు మాత్రం మారలేదని 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది ? ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? అని ప్రశ్నించారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా ? అని దుయ్యబట్టారు. ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుండి అసెంబ్లీకి వెళ్ళాలని కోరారు. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
11మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది ?: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read
Previous Article“హరిహర వీరమల్లు” నుండి సెకండ్ సింగల్ విడుదల …!
Next Article యష్ “టాక్సిక్” నుండి సరికొత్త అప్డేట్ …!