ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా తమ తల్లిదండ్రుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారాన్ని ప్రకటించిన తరువాత మొదటిసారిగా తమ స్వగ్రామం వెళ్లడంతో స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారత రత్న అవార్డు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక అటు రాజకీయంగానూ అలాగే ఎల్లప్పుడూ ప్రజా, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు