విభిన్న కధాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ప్రధాన పాత్రల్లో అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుశ్ నటిస్తున్నారు. అలాగే రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. నేడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా కుబేర విడుదల తేదీని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌లో సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఇదొక వైవిధ్యమైన సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ఏవిధంగా సినిమాను రూపొందించారోననే ఆసక్తితో సినీ ప్రేక్షకులు ఈచిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
Kubera releasing on 20th June ☄️ @dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP @SVCLLP @amigoscreation @jimSarbh @AsianSuniel pic.twitter.com/5YhxN7IwbQ
— Rashmika Mandanna (@iamRashmika) February 27, 2025

