ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు, సేవా బిల్ గేట్స్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. భారత్ పర్యటనకు వస్తున్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు. మూడేళ్లలో ఇది ఆయనకు మూడోసారి ఇక్కడికి రావడం. ఈ విషయాన్ని తన లింక్డ్ ఇన్ ఎకౌంట్ ద్వారా తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తోందని గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్ లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ మరోసారి ప్రశంసలు కురిపించారు. హెల్త్ కేర్, అగ్రికల్చర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సరికొత్త ఇన్నోవేషన్ తో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని కొనియాడారు. భారత్ చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను, పోలియో నిర్మూలనను ప్రశంసించారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న ఆవాహన్ వంటి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

