అనంతపురానికి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నేడు కలిశారు.వీరి కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది. 14 ఏళ్ల సిద్ధార్థ్ ఏఐ సాయంతో సిర్కాడియావీ యాప్‌ను రూపొందించాడు. ఇది ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులు నిర్ధారిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో రోగులకు పరీక్షలు కూడా నిర్వహించాడు. దాదాపు అరగంట పాటు అతనితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి సత్యాకుమార్ సిద్ధార్థ్ తండ్రి మహేష్ ఉన్నారు.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసిన సిర్కాడియావీ యాప్ రూపకర్త ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్
By admin1 Min Read