టాలీవుడ్ హీరోయిన్ సమంత తన ప్రతిభతో తెలుగుతో పాటు హిందీ,తమిళ సినీ పరిశ్రమల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఇటీవల ఆమె తెలుగులో సినిమాలు చేయకపోయినా,వెబ్ సిరీస్‌ల ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంది.తాజాగా ఓటీటీలో ఆమెకు ప్రతిష్టాత్మక ఉత్తమ నటి అవార్డు లభించింది.‘హనీ-బన్నీ’ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన నటన కనబరిచినందుకు ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆమెను ఈ పురస్కారంతో సత్కరించింది.ఈ అవార్డును అందుకోవడం తనకు గర్వకారణమని సమంత తెలిపారు.సిరీస్‌ను పూర్తి చేయడమే తనకు ఓ పెద్ద విజయమని,ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.‘సిటాడెల్ హనీ-బన్నీ’ సిరీస్‌ను పూర్తి చేయడంలో దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే, సహనటుడు వరుణ్ ధావన్ ఎంతో సహాయపడ్డారని, వారు చూపిన ఓపిక,మద్దతు వల్లే తన పనిని పూర్తిచేయగలిగానని సమంత కృతజ్ఞతలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు