సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలబోసిన ఈ చిత్రం ప్రేక్షకులకు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రతీకారం, ప్రేమ, న్యాయం కోసం పోరాడే పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న తన అభినయంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాణం చేపట్టారు. 2025 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Previous Articleఅన్నామలై వ్యాఖ్యలపై స్పందించిన డీకే శివకుమార్
Next Article డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు…!