ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’.ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో చివరిదిగా భావిస్తుండటంతో అభిమానులంతా దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే చిత్రయూనిట్ ఈ సినిమాను 2025 జనవరి 9న పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అయితే విజయ్‌కు ఈసారి పోటీ ఉండదని అనుకున్నప్పటికీ, అలా జరగకపోవచ్చు.తాజాగా, యువ హీరో శివకార్తికేయన్ తన కొత్త సినిమా ‘పరాశక్తి’ ని కూడా అదే సమయానికి తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం.ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.కాగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండటంతో, ఇది విజయ్‌కు గట్టి పోటీ ఇవ్వనుందని సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.‘జన నాయగన్’ vs ‘పరాశక్తి’ క్లాష్ తప్పదా? లేక విడుదల తేదీల్లో మార్పులు ఉంటాయా? అనేది చూడాల్సి ఉంది.