రాష్ట్రంలోని ఉన్నత, వృత్తివిద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటి, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటి సంస్థ సిస్కోతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది . ఉండవల్లి లోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ను సిస్కో అందిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధికి సిస్కో శిక్షణ అందించనుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యమని లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు