‘గేమ్ ఛేంజర్’ అనంతరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం “ఆర్‌సీ 16”. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రేపు రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల కానుంది.
ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా స్వయంగా వెల్లడించారు.రేపు ఉదయం 9:09 గంటలకు ఫస్ట్‌లుక్ రివీల్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.రామ్ చరణ్ అభిమానులు ఈ ఫస్ట్‌లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.