బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గోస్వామి 1937లో జన్మించారు. 1957లో ‘ఫ్యాషన్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ‘పలు చిత్రాలలో దర్శకుడిగా, రైటర్గా, నటుడిగా ప్రేక్షకులకు చేరువయ్యారు. ఎక్కువగా దేశభక్తి సినిమాలు తెరకెక్కించి అలరించారు. 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. బాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలు రూపొందించారు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ఫల్కే అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మనోజ్ కుమార్ మృతి పట్ల ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Previous Articleఐపీఎల్ లో కోల్ కతా అరుదైన ఘనత..!
Next Article ఏపీ సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం