తమిళ స్టార్ హీరో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, ‘రాయన్’, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగా మరోసారి సిద్ధమయ్యాడు.ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు)’, ఇందులో ధనుష్ స్వయంగా హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో నిత్యమీనన్ కథానాయికగా,అరుణ్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా మొదటగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారని ప్రకటించారు.అయితే ఇప్పుడు అక్టోబర్ 1కు వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం కొత్త పోస్టర్ విడుదల చేస్తూ ప్రకటించింది.డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్,అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.తిరుచిత్రబలం తర్వాత ధనుష్, నిత్యమీనన్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Idli kadai #oct1 pic.twitter.com/9EkllemSPt
— Dhanush (@dhanushkraja) April 4, 2025