రాజమహేంద్రవరంలో “అమరావతి చిత్రకళా వీధి” కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది సుమారు 500 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , ఎంపీ రఘురామ కృష్ణంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. కళాకారులు ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించిన చిత్రాలు చాలా చూడముచ్చటగా ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి విచ్చేసి కళాకారులను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ మంత్రి దుర్గేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల యొక్క ప్రతిభ, తమ కళలను ప్రదర్శించే అవకాశాన్ని ఈ కార్యక్రమం అందిస్తోంది.
Previous Articleధనుష్ ‘ఇడ్లీ కడై’ రిలీజ్ వాయిదా…!
Next Article ఐపీఎల్-18: ఆసక్తికర పోరులో ముంబైపై లక్నో పైచేయి..!