నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయశాంతి ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆకట్టుకోనున్నారు.ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ పోస్టర్‌లో కల్యాణ్‌రామ్, విజయశాంతి డైనమిక్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు, ఆ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ అవుతుందని తెలిపారు.ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రంలో సోహైల్ ఖాన్,యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా కల్యాణ్‌రామ్ కెరీర్‌లో మరో హై ఎనర్జీ ప్రాజెక్ట్‌గా నిలవనుందని తెలుస్తుంది.
Previous Articleభీమవరంలో సందడి చేసిన ‘జాక్ – కొంచెం క్రాక్’ చిత్రబృందం…!
Next Article ఏపీ రాజధాని అమరావతికి రూ.4200 కోట్ల నిధులు విడుదల