ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. వరల్డ్ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు మద్ధతుతో అమరావతికి రూ.4200 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. రాజధాని అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు సైతం తోడ్పాటు అందిస్తోంది. వేల కోట్ల నిధులను ఇప్పటికే అందించింది. ఈ విషయంపై కూటమి పార్టీల ఎంపీలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల కృషి వల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రానికి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు