మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్నాచురల్ థ్రిల్లర్ *ఓదెల 2* ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 2021లో వచ్చిన “ఓదెల రైల్వే స్టేషన్”కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో, తమన్నా నాగ సాధువుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే గత చిత్ర కథానాయికగా కాకుండా, ఈ సారి ఆమె పాత్ర మరింత గంభీరంగా, రహస్యాలతో నిండి ఉండనుందని స్పష్టమవుతోంది.టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.డి. మధు నిర్మాణంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, తమన్నా పాత్ర మిస్టీరియస్ షేడ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఓదెల గ్రామంలో జరుగుతున్న అనూహ్య సంఘటనల చుట్టూ నడిచే కథ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఊహించిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు