ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్నిప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ… పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం వివరాలు తెలుసుకుని… చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని పవన్ కు చెప్పారు. సింగపూర్ లో ఎటువంటి సహాయం కావాలన్నా తాము సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
ఇక మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, బీ.ఆర్.ఎస్ అగ్రనేతలు కే.టీ.ఆర్, హారీష్ రావు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ లు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష… ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ
By admin1 Min Read