అగ్ర నటుడు యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈచిత్రం నుండి తాజాగా ఒక అప్ డేట్ వచ్చింది. ఈ నెల 22 నుండి ఎన్.టీ.ఆర్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు సోషల్ వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఈసినిమా పై ఉన్నాయి.
Previous Articleటారిఫ్ ల నుండి రోజుకు 2 బిలియన్ డాలర్లు: డొనాల్డ్ ట్రంప్
Next Article ప్రభాస్ ‘ది రాజాసాబ్’ అప్డేట్…!