ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇది ప్రభాస్ కెరీర్‌లో తొలి కామెడీ హారర్ మూవీ కావడం విశేషం.
ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హారర్ కామెడీ జానర్‌లో మారుతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దర్శకుడు మారుతి స్పందిస్తూ,”కొంత టాకీ పార్ట్, కొన్ని పాటలు బ్యాలెన్స్‌లో ఉన్నాయి.అవి పూర్తయిన వెంటనే లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తాం” అని చెప్పారు.ఈ సినిమా కోసం సీజీ వర్క్ కీలకం అవుతుందని,ప్రస్తుతం పలు స్టూడియోలు పని చేస్తున్నాయని తెలిపారు.
కొన్ని స్టూడియోల అవుట్‌పుట్ బాగుండగా,మరికొన్నింటికి ఇంకా వేచి చూస్తున్నట్టు చెప్పారు.
ఈ ప్రక్రియలో అనేక అంశాలు భాగమవుతాయని, ఒక్కరే చేయగలిగే పని కాదని పేర్కొన్నారు.
సీజీ వర్క్ పూర్తయిన తర్వాత నిర్మాతలే **రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తారంటూ వెల్లడించారు.అంతా అంచనాలకు అనుగుణంగా ఉండేందుకు కృషి చేస్తున్నామని, అభిమానులు ఓపిక పట్టాలంటూ అభ్యర్థించారు.ఫస్ట్‌లుక్,టీజర్, ట్రైలర్‌ల కోసం రిలీజ్‌కు ముందే వరుసగా ప్రమోషన్స్ ఉంటాయని ఊహించవచ్చు.ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా, త్వరలో ఓ అధికారిక అప్డేట్ రావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.