బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది.2018లో వచ్చిన ‘రైడ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో తమన్నా ఒక ప్రత్యేక గీతంలో కనిపించింది.తాజాగా విడుదలైన ‘నషా నషా’ పాటలో ఆమె డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మ్యూజిక్, విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పరుచుకుంది.పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను భూషణ్ కుమార్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సస్పెన్స్, యాక్షన్‌తో నిండిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది.వేసవి బోనస్‌గా ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించనుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
Previous Articleసోషల్ మీడియాలో నీచమైన పోస్టులపై త్రిష ఘాటు స్పందన…!
Next Article కాంపా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్