నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్-3’. విజయవంతమైన ‘హిట్’ ఫ్రాంచైజీ నుండి వస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వాల్ పోస్టర్స్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపొందుతోంది. తిపిరినేని ప్రశాంతి నిర్మించారు. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈరోజు ఉదయం 11:07 కు విడుదల చేశారు. పవర్ ఫుల్ యాక్టింగ్ తో నాని మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించారు.ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మే లో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలైన ‘హిట్-3’ ట్రైలర్:పవర్ ఫుల్ యాక్షన్ తో అలరిస్తున్న నేచురల్ స్టార్ నాని
By admin1 Min Read