ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా తిరుమల స్వామివారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈరోజు వేకువజామున ఆమె స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం అన్నాకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవల వారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు పేరు మీద ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి రూ. 17లక్షలు ఆమె వితరణ చేశారు.
టీటీడీ అన్నదానానికి డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా భారీ విరాళం
By admin1 Min Read