బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.తాను హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ “క్రిష్” ఫ్రాంచైజీలో భాగంగా నాలుగో భాగానికి హృతిక్ రోషన్ దర్శకత్వం వహించనున్నాడు.20 ఏళ్ల క్రితం విడుదలైన ‘కోయీ మిల్ గయా’తో మొదలైన ఈ సిరీస్, ఆ తర్వాత ‘క్రిష్ 2’, ‘క్రిష్ 3’లతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంది.ఈ సిరీస్ వచ్చిన చిత్రాల్లో హృతిక్‌తో పాటు అందాల తార ప్రియాంక చోప్రా కథానాయికగా నటించగా,ఇక మూడో భాగంలో కంగనా రనౌత్,వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించారు.
అయితే తాజాగా తెరకెక్కనున్న ‘క్రిష్ 4’లో ప్రియాంక చోప్రా మరోసారి కథానాయికగా కనిపించబోతున్నారని సమాచారం.ఇటీవల హృతిక్ రోషన్ ఈ సినిమా కథను ప్రియాంకకు వినిపించగా…ఆమెను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.ప్రియా పాత్రలో ఆమె మెరవనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.అయితే ఈ విషయంపై ప్రియాంక చోప్రా టీమ్ నుండి ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు.కాగా ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.క్రిష్-4 కోసం ఏకంగా రూ.20 నుండి 30 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.