ఈ సంవత్సరం రుతుపవన కాలంలో సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇండియన్ మెటిరియాలజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) అంచనా వేసింది.ముఖ్యంగా ఏడాది పొడవునా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయని అంచనా వేసింది. ఈ సంవత్సరం మాత్రం 105 శాతం అధికంగా వర్షాలు పడతాయని వివరించింది. దీంతో రైతులకు లబ్ది చేకూర్చే విధంగా ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. జూన్- సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక యావరేజ్ 87 సెం.మీ ఉండగా ఈసారి అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మెహాపాత్ర తెలిపారు. ఎల్ నినో వంటి పరిస్థితి ఈసారి ఏర్పడకపోవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది రైతులకే కాదు, నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకూ ఊరటను కలిగించనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు