పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి-1’ సినిమా భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, మరో అంతర్జాతీయ ఘనతను సాధించింది. 2015లో విడుదలైన ‘బాహుబలి-1’ దాదాపు రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు స్పానిష్ భాషలో, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శింపబడుతూ, భారతీయ కథను మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, కిచ్చా సుదీప్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం, ఆర్కా మీడియా వర్క్ నిర్మాణ విలువలు సినిమాకు మరో లెవెల్ తెచ్చాయి. రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విజువల్ గ్రాండర్‌తో దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. స్పానిష్ వర్షన్‌తో బాహుబలి-1 ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల్లో కూడా మరింత ఆదరణ పొందుతోంది.