తమిళ స్టార్ హీరో శింబు తన నటనతోపాటు గాయకుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికే తమిళం, తెలుగులో అనేక పాటలను ఆలపించిన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రంలో ఓ సాంగ్ పాడినట్లు అధికారికంగా వెల్లడైంది.ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.అయితే శింబు “ఓజీ” కోసం పాట పాడుతున్నాడు’ అన్న వార్తలకు తాజాగా తమన్ చేసిన ప్రకటనతో ఆధికారిక ముద్ర పడింది.‘ఫైర్ స్ట్రామ్’ అనే టైటిల్‌తో కంపోజ్ చేసిన ఈ పాటకు శింబు గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ పాటను ఓజీ షూటింగ్ పునఃప్రారంభం తర్వాత విడుదల చేయనున్నట్టు తెలిపారు.సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, త్వరలో ‘ఓజీ’ షూట్‌కి తిరిగి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఈ సినిమాలో శింబు పాడిన పాట పవన్ అభిమానులకు మ్యూజికల్ ట్రీట్‌గా మారుతుందని అనే ఎలాంటి సందేహం లేదు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు