తెలుగు సినీ చరిత్రలో ఆల్ టైం బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి ‘. సోషియో ఫాంటసీ జానర్ లో ఒక మైలురాయిగా నిలిచి ఘన విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జోడీ. ఇళయరాజా సంగీతం. రాఘవేంద్ర రావు దర్శకత్వం, వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ ప్రమాణాలు. అత్యద్భుతమైన కథా కథనాలు ఈచిత్రాన్ని అత్యున్నత చిత్రాల్లో అగ్రభాగాన నిలిపాయి. 1990 మే9న విడుదైలైన ఈ చిత్రం అప్పట్లో తుఫాన్ ప్రభావాన్ని కూడా తట్టుకుని నిలబడి భారీ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. అప్పటి తరం వారికి మరీ ముఖ్యంగా 80, 90 దశాబ్దంలో వారికి ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. కాగా, మళ్లీ ఈ జెనరేషన్ వారిని కూడా అలరించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ తిరిగి విడుదల చేయాలని నిర్ణయించింది. మూడున్నర దశాబ్దాల తర్వాత తిరిగి వెండితెరపై 2D&3D లలో సందడి చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. 2025 మే 9న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
From the era of classics… to the hearts of a new generation ✨#JagadekaVeeruduAthilokaSundari re-releasing on May 9th in 2D & 3D.@KChiruTweets @Ragavendraraoba #Sridevi @ilaiyaraaja @AshwiniDuttCh @VyjayanthiFilms #JVASonMay9th pic.twitter.com/NEsGBSMDod
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 26, 2025