ఐదేళ్ల తర్వాత కైలాస్- మానస సరోవర్ యాత్ర పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది జూన్ నుండి తిరిగి ఈ యాత్ర ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకూ జరగనుంది. ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కానుంది. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ నుంచి ’50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు, సిక్కిం నాథులా పాస్ నుంచి 10 బృందాలు ఈ యాత్రకు తరలివెళ్లనున్నాయి. కైలాస్-మానసరోవర్ యాత్ర కోసం దరఖాస్తులను KMY.GOV.IN ద్వారా పంపించాలి. కంప్యూటర్ జనరేటెడ్ విధానం ఆధారంగా యాత్రికులను ఎంపిక చేస్తారు. గతంలో కొవిడ్ కారణంగా కైలాస పర్వతం, మానసరోవర్ సరస్సు యాత్ర 2020లో ఆగిపోయింది. ఆ తర్వాత గాల్వాన్ వ్యాలీ ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సంబంధాలు క్షీణించడంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు జరగలేదు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

