అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ. 22వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్లీన్ ఎనర్జీ రివల్యూషన్‌కి అనంతపురంలో భూమి పూజతో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఇండియాలో క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్‌కి భూమి పూజ చేసిన చారిత్రక ఘట్టంలో తానూ భాగం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. క్లీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్‌ని హబ్‌గా తీర్చిదిద్దేందుకు సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. విజనరీ సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో ది ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీ దేశానికి దిక్సూచిగా నిలవనుందని తెలిపారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్ , రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏపీలో ఏర్పాటు అవుతోంది.
క్లీన్ ఎనర్జీకి ఏపీని హబ్‌గా తీర్చిదిద్దేందుకు సంస్థలకు అవసరమైన సహాకారం అందిస్తాం: మంత్రి లోకేష్
By admin1 Min Read
Previous Articleదాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లలో ఎన్టీఆర్?… అమీర్ ఖాన్..?
Next Article విజయవాడలో ఘనంగా తిరంగా ర్యాలీ