అత్యున్నత విలువలు కలిగిన వ్యక్తి, ఎందరికో స్ఫూర్తి ప్రదాత, మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ తెరకెక్కనుంది. ‘కలాం’ పేరుతో రూపొందనున్న ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్ లో ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈసినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నారు. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్, టీ-సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈమేరకు మూవీ టీమ్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.
Previous Articleమలేసియా మాస్టర్స్: సింధు ఓటమి… ప్రణయ్, శ్రీకాంత్, ఆయుష్ ముందంజ
Next Article అప్రమత్తత అవసరం: దేశంలో ప్రస్తుతం అదుపులోనే కొవిడ్