మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ నుండి భారత స్టార్ షట్లర్ సింధు మొదటి రౌండ్ లోనే ఓటమితో వెనుదిరిగింది. మహిళల సింగిల్స్ లో సింధు 11-21, 21-14, 15-21తో వియత్నాం కు చెందిన లిన్ నుయెన్ చేతిలో ఓడింది. ఇక ఇతర మ్యాచ్ లలో మాళవిక బాన్సోద్ 21-19, 18-21, 8-21తో చైనీస్ తైపీకి చెందిన పిన్ చియాన్ చేతిలో, ఆకర్షి కశ్యప్ 9-21, 8-21తో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్థని చేతిలో, ఉన్నతి హుడా చైనీస్ తైపీకి చెందిన లిన్ సియాంగ్ చేతిలో 12-21, 20-22 తేడాతో పరాజయం చెందారు. పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి ముందడుగేశారు. శ్రీకాంత్ చైనీస్ తైపీకి చెందిన గ్వాంగ్ జు పై 23-21, 13-21, 21-11తో, ప్రణయ్ 19-21, 21-17, 21-16తో జపాన్ కు చెందిన కెంటా నిషిమోటో పై, కరుణాకరన్ చైనీస్ తైపీకి చెందిన తీన్ చెన్ పై 21-13, 21-14తో, ఆయుష్ 20-22, 21-10, 21-8తో కెనడాకు చెందిన బ్రయాన్ యాంగ్ పై గెలిచి ప్రీ క్వార్టర్స్ చేరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు