అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘OG’. పవన్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ స్థాయిలో ఆకట్టుకుని అంచనాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ సరసన నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రజా సేవలో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘OG’ నుండి ఈ వార్త రావడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.
Previous Articleగెలుపుతో గుడ్ బై చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్… పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం
Next Article ఆసక్తికరంగా ట్రాన్స్ ఆఫ్ ‘కుబేర’ టీజర్