‘పుష్ప’ చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కలయికలో ఓ భారీ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘AA22xA6’ అనేది వర్కింగ్ టైటిల్. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ను మూవీ టీమ్ పంచుకుంది. ప్రముఖ బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో దర్శకుడు అట్లీ, దీపికాకు ఆమె పాత్ర గురించి వివరిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు