ఈనెలలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ చేరుకుంది. ఈ సిరీస్ జూన్ 20 నుండి జరగనుండగా, భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. దీంతో ఈ పర్యటన భారత టెస్ట్ క్రికెట్‌లో ఒక కొత్త శకానికి ప్రారంభం కానుంది.
భారత జట్టు ఇంగ్లండ్ చేరుకున్న విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు అధికారికంగా ప్రకటించింది. “టచ్‌డౌన్ యూకే. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా వచ్చేసింది” అంటూ బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో అక్కడి పరిస్థితుల్లో భారత యువ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత జట్టు:
శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కే.ఎల్. రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఇక ఈ సిరీస్ లో జూన్ 20న మొదటి టెస్టు, జులై 2న రెండో టెస్టు, 10న మూడో టెస్టు, 23న నాలుగో టెస్టు, 31న ఐదో టెస్టు మొదలు కానున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు