కేవలం స్టార్ హీరోలతో హీరోయిన్ గా మాత్రమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ దూసుకుపోతున్న నటి కీర్తి సురేష్. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రివాల్వర్ రీటా’ సినిమా చేస్తోంది. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా శరత్ కుమార్, అజయ్ ఘోశ్, సురేశ్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుపుతూ.. సామాజా మాధ్యమాల వేదికగా ఓ వీడియోను పంచుకుంది మూవీ టీమ్. ఇందులో రీటా పాత్రలో కీర్తి సురేష్ గన్ పట్టుకొని సరికొత్తగా కనిపిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో గన్ చేతపట్టాల్సి వచ్చిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సుధాన్ సుందరం, జగదీశ్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Rita cominggg to you on 27th August! 💥 https://t.co/w68kqoVzXd
— Keerthy Suresh (@KeerthyOfficial) June 11, 2025