ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇది ప్రభాస్ కెరీర్‌లో తొలి కామెడీ హారర్ మూవీ కావడం విశేషం. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హారర్ కామెడీ జానర్‌లో మారుతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’ లో టీజర్ విడుదలని పురస్కరించుకుని దర్శకుడు మారుతి ఈ సినిమా వర్కింగ్ స్టిల్ ను అభిమానులతో పంచుకున్నారు. “ఇప్పుడందరూ నవ్వుతున్నా… రానున్నది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది’ అంటూ సరదా కామెంట్ చేశారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ గత సినిమాల్ని గుర్తు చేస్తూ, స్టైలిష్ అవతారంలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ఈ చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు